పదవి కాలం ముగిసినా ప్రజా సేవలో నిమగ్నం అవ్వండి…
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండల వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్.ఈ సందర్బంగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారు మాట్లాడుతూ..స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతీ గ్రామం నుండి పోటీ చేయాలని, మీ వెంట మేముంటామని అన్నారు.ఎలక్షన్ కౌంటింగ్ మొదలైనప్పుడు గుడ్లూరు మండలం లెక్కింపుకు వచ్చినప్పుడు కూటమి నాయకులలో భయం మొదలవుతుంది.ఎందుకంటే గుడ్లూరు మండలం వైయస్సార్సీపి గుండె అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మనం మోసపోయాం అని ప్రజలు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయరు, కన్ఫ్యూజన్ రాజకీయాలు చేయొద్దు రేపు జరగబోయే ఎలక్షన్ మీది… గెలవాల్సింది మీరు.. ఈ బుర్రా మధుసూదన్ యాదవ్ మీకు అండగా ఉంటానని తెలియ చేస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు దోచుకో.. దాచుకో.. పంచుకో ..అనే విధానంలోనే ఉన్నారని అన్నారు. అలాగే జగనన్న అభిమానించే ప్రతి అభిమాని నాకు అభిమానే అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతీ కార్యకర్త వెంట మేముంటామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. గత ఐదు సంవత్సరాలలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలనను ప్రజలకు తెలియజేస్తూ, నేడు కూటమి ప్రభుత్వం చేసిన అరాచక పాలనను ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ స్థానిక సంస్థల గెలుపు రేపు కందుకూరు నియోజకవర్గ నా గెలుపుకు పునాది అని అన్నారు. అనంతరం ఇటు వలె ఎంపిపి గా పనిచేసి పదవి కాలం పూర్తయిన సందర్భంగా గుడ్లూరు ఎంపీపీ పులి రమేష్ గారిని,కో ఆప్షన్ సభ్యులు షేక్ రషీద్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.అలాగే వైయస్సార్సీపి పార్టీ గుర్తింపు కార్డులను నాయకులకు కార్యకర్తలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.