సిoగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం సెక్టర్ లోనీ సోమరాజు పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నర్రవారిపాలెం అంగన్వాడీ సెంటర్ లో పౌష్టికాహారం మహోత్సవం అంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమం సందర్భంగా గురువారం ర్యాలీ నిర్వహించారు. టంగుటూరు సిడిపిఓ వై అంజమ్మ ఆదేశాల మేరకు సూపర్వైజర్ ఎస్ కే సైదాబీ సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లులకి గర్భవతులు బాలింతలకు అంగన్వాడీ ఆధ్వర్యంలో ఇస్తున్న పౌష్టికాహార విలువల గురించి వివరించడం జరిగింది. ఆకుకూరలు తినడం ద్వారా ఎంతో అరుగుకరంగా ఉండవచ్చని బాలింతలకు గర్భవతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త టీ రాజమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొని. అనంతరం నర్రా వారి పాలెం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *