ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ప్రకాశం జిల్లా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది కాలనీలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *