గుడ్లూరు సీఐ గారు మరియు గుడ్లూరు, లింగసముద్రం, వి.వి.పాలెం సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లపాలెం గ్రామంలో పోలీసులు ఇంటింటికీ తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు మరియు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో CASO ఆపరేషన్ చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.ప్రజల సహకారంతో గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు, నేరాల నియంత్రణకు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *