తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
ఈ నెల 9వ తేదీన కొండేపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం, నరసింగోలు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న నేపథ్యంలో సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, IAS గారు మరియు జిల్లా అధికారులతో కలిసి సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలను కనిగిరి గౌరవ శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షులు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు.ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.