ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంలో భాగంగా కందుకూరు సీఐ శ్రీ ఎస్. జగదీష్ గారి ఆధ్వర్యంలో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓగూరు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.CASOలో భాగంగా పోలీసులు గ్రామంలోని ఇళ్లను, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేకంగా పరిశీలన చేపట్టి, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని కందుకూరు పోలీసులు తెలిపారు.ప్రజలు పోలీసులకు సహకరిస్తూ తమ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *