కందుకూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. జడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా, ఉలవపాడు మండలంలోని తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల ముఖ్య నేతలతో… ఉలవపాడులో ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముందుగా అభ్యర్థుల ఎంపికపై, స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. MLA నాగేశ్వరావు గారు మాట్లాడుతూ…. ఈనెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. గెలుపే లక్ష్యంగా, స్థానికుల అభిప్రాయాలతోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. మూడు పార్టీల నాయకులు పరస్పరం సహకరించుకుంటూ, ప్రతి స్థానాన్ని గెలుచుకునేలా కృషి చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరావు గారు, ఎంపీటీసీ స్థానాల వారీగా నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ఆశావహులు ఎమ్మెల్యే గారిని కలిసి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీనియారిటీ, కష్టపడే తత్వంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులనే అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు.మండలంలో జడ్పిటిసి, ఎంపీపీ సహా 15 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకునేలా కష్టపడాలని నేతలకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు సూచించారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి అత్యధిక మెజారిటీలతో కూటమి అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉలవపాడు పంచాయతీ కొల్లూరుపాడు ఎస్సీ కాలనీకి చెందిన వెలిచెర్ల రఘురామయ్య, ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సమావేశంలో మండల టిడిపి అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్చార్జిలు పోలుబోయిన శ్రీనివాసులు, బెల్లం కృష్ణమోహన్, ఏఎంసీ డైరెక్టర్ అమ్మనబ్రోలు మాధవ, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మద్దసాని మహేంద్ర, మండల జనసేన అధ్యక్షుడు అయ్యప్ప, బిజెపి అధ్యక్షుడు రాంబాబు, అన్ని గ్రామాల నేతలు హాజరయ్యారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *