ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో విధుల నిర్వహణను సమీక్షించడం, పోలీసు వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, రాబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంలో భాగంగా కందుకూరు డీఎస్పీ గారు కొండపి సర్కిల్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా కొండపి సర్కిల్ కార్యాలయంలోని రికార్డులు, పరిపాలనా వ్యవహారాలు, విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించి, పోలీసు అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.పంచాయతీ ఎన్నికల భద్రతపై ప్రత్యేక సూచనలు
రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎస్పీ గారు ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, పోలీసు అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజలకు భద్రతా భావాన్ని కల్పిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రశాంతమైన పంచాయతీ ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని కందుకూరు డీఎస్పీ గారు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *