తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచి కందుకూరు నియోజకవర్గంలో వైసిపికి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. అనేక గ్రామాలలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి టాటా చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు మద్దతుగా, ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. తాజాగా శుక్రవారం 3 మండలాల్లోని నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన మల్లిరెడ్డి పెదరాగయ్య, చెన్నకృష్ణ, వెంకటనరసింహం వడ్డివల్లి రాములు, రొడ్డ ఆనంద్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ టిడిపి నాయకుడు పల్లపోతు వెంగళరావు, గ్రామ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడ్లూరు మండలం కర్లపాలెం గ్రామనాయకుడు చాపల రమణయ్య ఆధ్వర్యంలో…. లంకె వెంకటకృష్ణ, అప్పాడి శ్రీను, అయ్యల శ్రీను, నెల్లూరి ప్రసాద్, రాసాని శ్రీనివాసులు తదితరులు పార్టీలో చేరారు. కందుకూరు మండలం శ్రీరంగరాజపురం ఎస్సీ కాలనీకి చెందిన దాసరి ప్రభాకర్, గుంటక వెంకటేశ్వర్లు, సుదర్శి జయ, ఇంకా పలువురు సైకిల్ ఎక్కారు. మండల టిడిపి అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, పాలూరు దొండపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు వినోద్ రెడ్డి, పూనూరు వీరారెడ్డి, వంకదారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వారందరినీ ఉద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…. స్థానిక సంస్థల ఎన్నికల్లో, అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలు సాధించేలా కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఈ చేరికలకు ప్రధాన కారణమని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసిపి విధానాలు నచ్చక, అనేకమంది ఆ పార్టీని వీడి తెలుగుదేశంలోకి వస్తున్నారని తెలిపారు.