పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావం కల్పించే లక్ష్యంతో కనిగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పోలీసుల మార్చ్‌ఫాస్ట్ ర్యాలీ నిర్వహించారు. కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది.ఈ కార్యక్రమంలో కనిగిరి సీఐ సుబ్రమణ్యం, పామూరు సీఐ వినోద్ కుమార్‌తో పాటు పలువురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో ప్రజలు గుంపులుగా చేరకూడదని, ఎక్కడా గొడవలు సృష్టించకూడదని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *