ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 59 వ డివిజన్ సిపిఎం అభ్యర్థి గంధ వల్ల బాలకృష్ణ డివిజన్లోని అయ్యాన్ని రోడ్డు వెంకటేశ్వర నగర్ కళ్ళకుంట మయూరినాదం వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యన్న వీధిలో కాలువల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు టిడ్కోఇల్లు రాని పేదవారికి ఇల్లు ఇప్పించడానికి ప్రభుత్వం పై పోరాడుతామన్నారు. మంచినీరు పాత లైన్ వలన సక్రమంగా రావటం లేదు వాటికోసం కృషి చేస్తామన్నారు ప్రభుత్వం ప్రజలపై మోపే ఆస్తి పన్ను భారానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు సిపిఎం నగర కార్యదర్శి సభ్యులు జి రమేష్ మాట్లాడుతూ 59వ డివిజన్లో సిపిఎం అభ్యర్థి గనవల్ల బాలకృష్ణను గెలిపించాలని వార్డు సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. డివిజన్లో సమస్య పరిష్కారానికి పోరాడే వ్యక్తికే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖా కార్యదర్శులు జి.భీ.ష్మాచారి వి మాలకొండయ్య జి ఆదిలక్ష్మి ధారా వెంకటేశ్వర్లు సిపిఎం నాయకులు ఎం శ్రీనివాసులు టీ భక్త సింగ్ రాజు ధర్నా సి కోటేశ్వరరావు ఎస్ జ్యోతి కే రాజేశ్వరి డి ఏడుకొండలు పి పద్మపి రమణారెడ్డి జి మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *