తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. సీఐ దర్శి గారు, సీఐ సంతమాగులూరు గారు మరియు సిబ్బంది సమన్వయంతో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు లేని 39 మోటార్ సైకిళ్లు మరియు 1 ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాంతంలో నేరాల నియంత్రణ, అనుమానితుల కదలికలపై నిఘా పెంపు మరియు ప్రజల్లో భద్రతాభావం కల్పించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా పోలీసులు తెలిపారు.ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.ప్రకాశం జిల్లా పోలీసుల ఈ చర్యలు నేర నియంత్రణలో కీలకంగా నిలుస్తున్నాయి.