google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరులో పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రయాణికులు, ఆటోడ్రైవర్లకు ఎమ్మెల్యే స్వయంగా మజ్జిగ అందించారు. చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన పట్టణ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు షేక్ సలాంను ఎమ్మెల్యే గారు, పోలీస్ అధికారులు అభినందించారు. అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు డి.ఎస్.పి బాలసుబ్రమణ్యం, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ అన్వర్ బాషా, పట్టణ ఎస్సై శివ నాగరాజు, రూరల్ ఎస్సై బాలకృష్ణ, ఉలవపాడు ఎస్సై సుబ్బారావు, పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *