google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజల భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు, నేరాల నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా పలు ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.
ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. గ్రామాలు మరియు పట్టణాల్లో ఆకస్మికంగా నిర్వహించిన ఈ తనిఖీల ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు.ఇదే క్రమంలో మర్రిపూడి మండలంలోని వేమవరం గ్రామంలో కొండపి సీఐ ఆధ్వర్యంలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా, సరైన పత్రాలు లేని 35 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.అదేవిధంగా, గ్రామ ప్రజలకు భద్రతా జాగ్రత్తలపై సూచనలు ఇస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ ఆపరేషన్‌లో సర్కిల్ సిబ్బంది మరియు పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, శాంతి భద్రతల పరిరక్షణలో తమ కట్టుబాటును మరోసారి చాటారు. ఇలాంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని, నేరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *