తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై గారి ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుండగా, ఆలకూరపాడు గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది.దీనిపై వెంటనే స్పందించిన టంగుటూరు ఎస్సై తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,888/- నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, జూదం వంటి అక్రమ కార్యకలాపాలు కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీసి సమాజంలో నేరాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో జరుగుతున్న జూదం, మద్యం, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.