తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణపై మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టేందుకు దర్శి డీఎస్పీ గారి ఆధ్వర్యంలో అద్దంకిలో కీలక క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సంతమాగులూరు సర్కిల్, అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్ మరియు అద్దంకి రూరల్ సర్కిల్‌కు చెందిన అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరిధిలో నమోదవుతున్న వివిధ నేరాలు, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలపై నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, జూదం, బెట్టింగ్, సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఎస్పీ గారు అధికారులకు సూచించారు.గ్రామాలు మరియు పట్టణాల్లో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు, వాహన తనిఖీలు, రాత్రి బీట్‌లు మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని సూచించారు.నేరాల నియంత్రణలో సాంకేతికత వినియోగం, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, రౌడీ షీటర్ల కదలికల పర్యవేక్షణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ, పోలీస్ శాఖపై విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.