మద్దిపాడు మండలం, తెల్లబాడు-దొడ్డవరం గ్రామాల్లో వెలసిన శ్రీ మధ్విరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా.. కొండపల్లి పవన్ గారు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ బి.ఎన్. విజయ్ కుమార్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.కీ.శే. మాలిపేద్ది రామకృష్ణ గారి జ్ఞాపకార్ధంగా ఏర్పాటు చేసిన ఈ క్రీడలు మన సంస్కృతికి, ఒంగోలు గిత్తల సత్తాకు నిదర్శనం. ఈ సందర్భంగా పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలిచిన జతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశాము. మన పాడి పశువులను, సంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *