ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో ఉప్పుచెరువు 5వ లైన్ లో ఉన్న నూతన ఎరూషలేము ప్రార్థన మందిరంలో JDBM టౌన్ బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజం జాయింట్ ట్రెజరర్ జంగాల వనజ ప్రభు కుమార్ అధ్యక్షతన అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు JDBM టౌన్ బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజం చైర్మన్ జంగాల మణి రవి గారు వాక్య సందేశాన్ని అందించి తల్లి ప్రేమ నిస్వార్ధమైనది,తల్లి కష్టపడుతుంది, కుటుంబం కోసం త్యాగం చేస్తుంది, పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తుంది, దేవుని దృష్టిలో తల్లి సేవ ఎంతో విలువైనది అని తెలియజేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సమితిని అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దాతల సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన తల్లులకు చీరలు పంపిణీ చేసినట్లు సేవాసమితి కార్యదర్శి శీలం వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు, JDBM టౌన్ బాప్టిస్ట్ చర్చ్ ట్రెజరర్ జంగాల ప్రభు కుమార్, పాస్టర్ మహేష్, అరుణ వెంకటేష్, వినూత్న, ప్రేమ్ బాబు, మైత్రేష్, నితీష్, వేణుబాబు, చరణ్ తేజ, లలితమ్మ, ప్రవల్లిక మరియు సంఘస్తులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *