బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల కాలేజీ ఆఫ్ ఫార్మసీ బాపట్ల లో ఫోక్సో చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార సంస్థ ప్యానల్ అడ్వకేట్ దగ్గుమల్లి కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక నేరాలు నుండి రక్షణ కల్పిస్తూ ఈ చట్టాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని మైనర్ పిల్లలపై లైంగిక దాడులు నుండి అమ్మాయిలకు అబ్బాయిలకు సమానంగా ఈ చట్టం రక్షణ కల్పిస్తూ ఉన్నది అని గుడ్ టచ్ అంటే ప్రేమ, బాధ్యత, ఆదరణ కలిగించే స్పర్శ ఈ స్పర్శ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, డాక్టర్ గారు, క్రీడల్లో విద్యార్థులు వలన కలిగే స్పర్శను గుడ్ టచ్ అంటారు
అదే విధంగా బ్యాడ్ టచ్ అంటే నేరస్తులు, అల్లరి మొకాలు, ర్యాగింగ్లు చేసేవారు, హింసలకు పాల్పడేవారు ద్వారా జరిగే స్పర్శలను బ్యాడ్ టచ్ అంటారు అని ఇలాంటి వారి వలన జరిగే అసౌకర్యం, భయము ,నొప్పి ,ఇబ్బందులు, కలుగుతాయని శరీరంలోని ప్రైవేటు భాగాలు తాకితే నో అని చెప్పాలని ఆన్లైన్ సేఫ్టీ గురించి ఈ రోజుల్లో పిల్లలు అందరికీ తగు సూచనలు చేసే బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలు కు ఈ సమాజంలో ఎంతైనా ఉందని ఎక్కడైనా మైనర్లపై లైంగిక దాడులు చేస్తే, జరిగితే పోలీసులకు, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖ వారికి, మరియు సంబంధిత శాఖలకు వారికి 1098,181,100 ఫోన్ చేసి వారిని రక్షించటం సామాజిక బాధ్యత అని అన్నారు సీనియర్ ప్యానల్ అడ్వకే సిహెచ్ రామాంజనేయులు గారు మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఫోక్సల్ చట్టం ప్రత్యేకంగా బాల బాలికలకు ఏర్పాటు చేయబడినదని ప్రత్యేక చట్టం తెలుసుకొని అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ ఉండాలని అన్నారు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ T.E గోపాలకృష్ణమూర్తి గారు గారు మాట్లాడుతూ రోడ్డు చట్టాల గురించి తెలుసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని విద్యార్థులకు అవగాహన కలిగించినారు కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కే పూర్ణచంద్రరావు గారు NCC ఆఫీసర్ Mrs CH. సుష్మా గారు విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *