తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు పీసీ కేశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం సాయంత్రం కనిగిరి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు, ప్రధాన సెంటర్లు వద్ద నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ నూతన లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని, హక్కులను కోల్పోతారని, శ్రమ పెరుగుతుందని అన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న పాత లేబర్ కోట్స్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం రూ 25000 అమలు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేంద్రం కార్మికులకు నష్టం కలిగించేలా కోడ్స్ ను అమలు చేసేందుకు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు సహకారం అందించడం దుర్మార్గమన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా పోరాటం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ నరేంద్ర నాయకులు ప్రసాద్,ఏడుకొండలు,టోపీవలి,వెంకటయ్య,ఓబయ్య, దస్తగిరి, అడివయ్య, శ్రీను, ప్రసంగి,ప్రసాద్,సురేష్, సౌభాగ్యం, రత్తమ్మ,షమీల,శాంతకుమారి , రమణమ్మ, లాల్ భీ తదితరులు పాల్గొన్నారు.