కందుకూరు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి, ఎమ్మెల్యే గారి పట్ల ప్రజల్లో సానుకూలత, అభిమానం రోజురోజుకూ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.
కందుకూరు చరితను, భవితను, రూపురేఖల్ని మారుస్తూ.. ప్రజల ఆశీర్వాద బలంతో, ప్రతిపక్ష నేతలు సైతం అంగీకరించేలా, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఏకైక నాయకుడు మన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు.
కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఈరోజు ఉలవపాడు మండలం, కరేడు పంచాయితీ, కొత్తపల్లిపాలెం గ్రామానికి చెందిన 10 YCP కుటుంబాల వారు, నాగేశ్వరరావు గారిపై నమ్మకంతో, ఆయనతో కలిసి ప్రయాణించాలన్న దృఢ నిశ్చయంతో స్వచ్ఛందంగా TDP కార్యాలయానికి వచ్చారు.మత్స్యకార కుటుంబాలకు చెందిన పొన్నాడి శ్రీను, ఏడుకొండలు, బలరాం, నాగరాజు, వెంకటేశ్వర్లు, వంశీ, సుధాకర్, శ్రీను, బాలాజీ, రామ్ చరణ్ తదితరులు ఎమ్మెల్యే గారి సమక్షంలో పసుపు కండువాలు కప్పుకొని, తెలుగుదేశం పార్టీలో చేరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *