తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
గత నెల రోజులుగా ఖాళీగా ఉన్న సింగరాయకొండ పోలీస్ స్టేషన్ కి జిల్లా పోలీస్ అధికారులు ఎస్సై ని నియమించారు. జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాలతో ఎస్సై గా నియమితులైన లేళ్ల సుధీర్ కుమార్ గురువారం మధ్యాహ్నం సింగరాయకొండ ఎస్సై గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంత కాలం పల్నాడు జిల్లా లో బాధ్యతలు నిర్వహించారు.ఈ సందర్భంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై కి.స్వాగతం పలికారు. స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై సుధీర్ కుమార్ ని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ సిబ్బంది కి తన ప్రాధాన్యతల గురించి వివరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పరిరక్షణ ప్రజా పోలీసింగ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. దాని తోపాటు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగ అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ నియంత్రణ కి ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని కోరారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు గారి ఆదేశాలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మార్గదర్శనం, సిఐ శ్రీహరి పర్యవేక్షణ లో పోలీస్ సిబ్బంది ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు.