తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
అక్రమ కోడి పందేల నిర్వహణపై పామూరు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడిలో అక్రమంగా కోడి పందేలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.