తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా శక్తి యాప్ (Sakthi App) వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు మరియు వివిధ సామాజిక వర్గాల మధ్య నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు, బాలికలకు భద్రతా చైతన్యం కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మహిళలకు శక్తి యాప్ వినియోగ విధానం గురించి వివరించి, అత్యవసర పరిస్థితుల్లో ఒక క్లిక్‌తో పోలీసుల సహాయం ఎలా పొందవచ్చో తెలియజేశారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, అనుమానాస్పద పరిస్థితులు లేదా ప్రమాదకర సందర్భాల్లో శక్తి యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.అదేవిధంగా చిన్నారుల భద్రత, మహిళల రక్షణలో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు సమాజం మొత్తం బాధ్యత వహించాలని సూచించారు. మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి సమస్యలను తెలియజేయాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.మహిళలు, చిన్నారులపై నేరాల నివారణకు అవగాహన కార్యక్రమాలు కీలకమని, భద్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు.