దస్తావేజు లేఖర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురంలో ఇటీవలన భూ సమస్యలు ఎక్కువయ్యాయని దస్తావేజు లేఖరులు డబల్ రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ MD. K. అల్తాఫ్ హుస్సేన్ హెచ్చరించారు. మంగళవారం మార్కాపురం లోని దస్తావేజు లేఖరులు ( డాక్యుమెంటు రైటర్లు) తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భూముల రిజిస్ట్రేషన్ లో పరదర్శకంగా వ్యవహరించాలన్నారు. క్రయ, విక్రయదారులకు తెలియకుండా డబల్ రిజిస్ట్రేషన్లు చేస్తే సహించేది లేదన్నారు. దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లకు రిజిస్ట్రేషన్లు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చిన్న పొరపాటుతో జీవితాంతం
ఇరువర్గాలు నాశనమయ్యే అవకాశం ఉందన్నారు. కనుక డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో 1b, అడంగల్, పట్టాదారు పాసుపుస్తకం, ఈసీలను పరిశీలన చేసుకొని రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఇక మీదట మార్కాపురంలో రిజిస్ట్రేషన్లు జరిగి పోలీసులకు ఫిర్యాదులు వస్తే కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విశ్వనాథరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.