పోలీసు శాఖలో విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, వెండి జ్ఞాపికలను బహుకరిస్తూ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.”ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉన్నా, వ్యక్తిత్వానికి మాత్రం రిటైర్మెంట్ ఉండదన్నారు. సుదీర్ఘకాలం విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం చాలా ఆనందదాయకమని తెలిపారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో బాధ్యతాయుతంగా జిల్లా పోలీసు శాఖకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. వారి యొక్క సర్వీస్ లో రివార్డ్స్, సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, గుడ్ సర్వీస్ పొందియున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉన్నా వ్యక్తిత్వానికి మాత్రం రిటైర్మెంట్ ఉండదన్నారు. సుదీర్ఘకాలం విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ జిల్లా పోలీసు శాఖకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. వారి సేవాకాలంలో పలు రివార్డులు, సేవా పతకాలు, ఉత్తమ సేవా పతకాలు మరియు గుడ్ సర్వీస్ ఎంట్రీలను పొందియున్నారు.సకాలంలో రిటైర్మెంట్ ప్రయోజనాలు అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని, వచ్చిన డబ్బులను జాగ్రత్తగా, సరైన ప్రణాళికతో వినియోగించుకోవాలని సూచించారు. పోలీసు ఉద్యోగంలో సేవలందించేందుకు సహాయ, సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీసు శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. అలాగే, పదవీ విరమణ తర్వాత ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.”
ఉద్యోగ పదవీ విరమణ పొందిన వారి వివరాలు:
1) జి.సుబ్రహ్మణ్యం,SI.637, సర్వీస్ – 42 సం, ఒంగోలు వన్ టౌన్, ప్రకాశం జిల్లా
2) బి.రాంబాబు ( ARSI-1466), సర్వీస్ – 36 సం, ఎఆర్ విభాగం, ఒంగోలు.
3)ఏ.సత్యం, ASI 1615, సర్వీస్ – 36 సం,CCS పోలీస్ స్టేషన్, ఒంగోలు
4) కట్టా రమణయ్య, HC.902, సర్వీస్ – 34, పొన్నలూరు పియస్. ప్రకాశం జిల్లా ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామి రెడ్డి, ఎఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *