తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
మహిళలు, బాలికలు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా తక్షణ పోలీస్ సహాయం పొందేలా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శక్తి యాప్‌పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు, సాంకేతికత ఆధారిత భద్రతా వ్యవస్థలను ప్రజలకు చేరువ చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం.జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు మరియు వివిధ సామాజిక వేదికల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో శక్తి యాప్‌ను మొబైల్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా నమోదు చేసుకోవాలి, అత్యవసర పరిస్థితుల్లో SOS ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తున్నారు.మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు, స్టాకింగ్, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేదా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు శక్తి యాప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చని అధికారులు వివరిస్తున్నారు.అదేవిధంగా చిన్నారుల భద్రత, POCSO చట్టం, సైబర్ భద్రత, మహిళల హక్కులు మరియు అందుబాటులో ఉన్న పోలీస్ సేవల గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, బాలికలు భయపడకుండా తమ సమస్యలను పోలీసులతో పంచుకోవాలని, వారి భద్రత కోసం పోలీస్ శాఖ 24/7 అందుబాటులో ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు.సాంకేతికతను వినియోగించి మహిళలకు మరింత భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణం సాధించడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని పోలీసులు తెలిపారు.