రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్లు మరియు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో మలుపులు, ఘాట్ రోడ్లు, దృశ్యమానత తక్కువగా ఉండే ప్రాంతాలు మరియు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాల్లో కన్‌వెక్స్ మిర్రర్లు (కుంభాకార దర్పణాలు), స్ప్రింగ్ పోల్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఎదురుగా వచ్చే వాహనాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులకు సహాయపడుతుంది.ప్రత్యేకంగా రాత్రి వేళల్లో మరియు మలుపుల వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడనున్నాయని పోలీసులు తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.ప్రజల ప్రాణ రక్షణే ప్రధాన లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతూ, ప్రమాద రహిత రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *