తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ వైఎస్సార్సీపీ పార్టీ క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం, గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అబ్జర్వర్ షాంశీర్ అలీ బేగ్, సంతనూతలపాడు వైఎస్సార్సీపీ అబ్జర్వర్ బోట్ల రామారావు, స్టేట్ జాయింట్ సెక్రటరీ (SIR) జిల్లా ట్రైనర్ రాజీవ్ హాజరయ్యారు.సమావేశానికి ముందు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు నల్ల బెలూన్లు ఎగురవేశారు. యువత, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు.ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బూత్ కన్వీనర్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, మహిళా విభాగం ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.