google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజల ప్రాణ రక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్లు, ఘాట్ రోడ్లు మరియు మలుపుల వద్ద కన్‌వెక్స్ మిర్రర్లు (కుంభాకార దర్పణాలు) ఏర్పాటు చేశారు.వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు ముందుగానే కనిపించేలా, ప్రమాదకర మలుపులు మరియు దృశ్యమానత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కన్‌వెక్స్ మిర్రర్లను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు.ప్రత్యేకంగా రాత్రి వేళల్లో మరియు ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు. రహదారులపై అప్రమత్తంగా ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వేగ నియంత్రణతో సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.ప్రజల భద్రత కోసం ఆధునిక మరియు వినూత్న చర్యలను చేపడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *