google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.జిల్లాలోని ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, కూడళ్లు మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ధరించడం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.అదేవిధంగా దొంగిలించబడిన వాహనాల గుర్తింపు, నేరస్థుల కదలికలపై నిఘా, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా అనుమానాస్పద వాహనాలు మరియు వ్యక్తులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవసరమైన చోట సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా వంటి ఆధునిక పద్ధతులను వినియోగిస్తూ భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తున్నారు.ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం ప్రాణాంతకమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలని పోలీసులు సూచించారు.ప్రజల సహకారంతో నేరాలను అరికట్టడం, ప్రమాదాలను తగ్గించడం మరియు సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్న పోలీసులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *