తొలి శుభోదయం న్యూస్ మాలకొండ:-
నూతనంగా నియమితులైన ఆలయ కార్యనిర్వహణాధికారి పి. శ్రీనివాసులురెడ్డి గారు వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు.. అందులో భాగంగా ఎప్పటినుండో యధేచ్చగా సాగుతున్న vip దర్శనాలకు చెక్ పెట్టి సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ నూతన మార్పులు చేశారు. ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణ దారులను మందలించి ప్రతీ దుకాణం ముందు dustbin లు ఏర్పాటు చేయించి ఆలయ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పలు మార్పులు చేకూర్చారు.. దుకాణాల ముందు చెత్త చెదారం ఉన్నచో వెంటనే వారి లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. గతంలో ఉన్న ప్రసాద టిక్కెట్స్ విధానాన్ని రద్దు చేసి పారదర్శకంగా poc మెషీన్ లతో అందరికి స్వామివారి ప్రసాదం అందేలా చర్యలు తీసుకొన్నారు.. రాబోవు రోజులలో అన్ని ఆన్లైన్ ద్వారానే వివిధ కార్యక్రమాలు పారదర్శకంగా ఉంటాయని, పార్కింగ్, అన్నదానం, 2వ ఘాట్ రోడ్ వివిధ అంశాలు త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయి అని గౌరవ శాసన సభ్యులు వారి సూచనల మేరకు ఇంకను పెను మార్పులు వచ్చి రాబోవు రోజులలో దేవస్తానమును ఇంకను అభివృద్ధి చేయుటకు తనవంతు కృషి చేస్తామని ఆలయ e. o. శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు..