google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు త్రిపురాంతకం సీఐ గారి ఆధ్వర్యంలో, త్రిపురాంతకం ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది త్రిపురాంతకం మండలంలోని ఉప్పలగుట్ట కాలనీలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు, ఇళ్లు, దుకాణాలు మరియు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిల్వ, విక్రయాలు మరియు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే వాహనాల పత్రాలు పరిశీలిస్తూ సరైన పత్రాలు లేని వాహనాలపై చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ వినియోగం, సైబర్ నేరాల నివారణ, ఓటీపీ మోసాలు, ఆధార్ వివరాల భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-112 లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *