తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా పోలీసు భద్రతా విభాగంలో సుమారు 9 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన పోలీసు పేలుడు పదార్థాలు (Explosive)గుర్తించే జాగిలం “సింధు” (వయస్సు: 10 సంవత్సరాలు) వయోభారం కారణంగా అనారోగ్యంతో తేది:19.03.2026న మృతి చెందింది. సింధు మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సింధు పార్థివదేహంపై పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.జిల్లా పోలీసు శాఖకు సింధు అందించిన సేవలు మరువలేనివని, అనేక అనుమానస్పద ప్రదేశాలలో తనిఖీలు, విఐపీ బందోబస్తు విధులలో చురుగ్గా, సమర్థవంతంగా పనిచేసిందని తెలిపారు. సింధును పోలీస్ కుటుంబ సభ్యురాలిగా భావించామని, సింధు మృతి తీరని లోటని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన సింధు 18.05.2018న ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో చేరింది. ఏఆర్ కానిస్టేబుల్ పి.నరేష్ (PC.2768) ఈ జాగిలానికి హ్యాండ్లర్‌గా వ్యవహరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయం నుండి సింధు పార్థివదేహాన్ని తీసుకెళ్లి కర్నూల్ రోడ్డు, మంగమూరు జంక్షన్ మీదుగా జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు చేరుకుని అక్కడ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఏఆర్ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *