తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అవినాష్ పుట్టినరోజు వేడుకలను…. పట్టణంలోని కోవూరు రోడ్డులో గల స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాలలో గురువారం రాత్రి నిర్వహించారు. టీం ఐ ఎన్ ఆర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సౌజన్య పాల్గొన్నారు. టిడిపి నేతలతో కలిసి కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. పిల్లలందరినీ పలకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, పిల్లలు కలిసి అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు ముచ్చు రాజ్యలక్మి, అశ్వినీరాణి, శివపార్వతి, గుమ్మా శివ, అత్తంటి శివకృష్ణ, సవిడిబోయిన వెంకట కృష్ణ, భవనాసి వెంకటేశ్వర్లు, పీలా శ్రీనివాసులు, నీలిశెట్టి శివరామకృష్ణ, నల్లూరి సూర్యనారాయణ, మచ్చా మనోహర్, నాదెండ్ల మధు, జమ్ము చైతన్య, చుంచు వేణు, జక్కుల శ్రావణ్, పెదకత్తుల రవి, ముప్పవరపు వేణు, చల్లా మహేంద్ర, కందల రాజశేఖర్ పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *