తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అవినాష్ పుట్టినరోజును పురస్కరించుకుని, స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు గురువారం పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు సతీమణి సౌజన్య…. రోగులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పండ్లు అందజేశారు. పేషంట్ల యోగక్షేమాలు తెలుసుకుని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంద్రాణి, వైద్యులు, సిబ్బంది… ఇంటూరి అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, పట్టణ మహిళా అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, అశ్విని, పార్వతి, కుమారి, ద్రాక్షాయిని, శ్రీలక్ష్మి, పద్మజ, గుమ్మా శివ, భవనాసి వెంకటేశ్వర్లు, మచ్చా మనోహర్, నల్లూరి సూర్యనారాయణ, నాదెళ్ల మధు, నీలిశెట్టి శివరామకృష్ణ , జక్కుల శ్రావణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
