తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి 18వ వార్డులోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై, వారితో కలిసి భోజనం చేసి మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై తెలుసుకున్నారు.పిల్లల ఆరోగ్యం, పోషకాహారం పట్ల ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు పాఠశాలలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.విద్యార్థులకు అందే భోజనం పరిశుభ్రంగా, నాణ్యంగా ఉండేలా సిబ్బంది నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.విద్యార్థుల ఆరోగ్యం – మన భవిష్యత్తుకు బలమైన పునాది