తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

వేసవి కాలంలో కూడలి గ్రామం సింగరాయకొండ కి రాకపోకలు చేసే ప్రజలకు త్రాగు నీటి సౌకర్యం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని సింగరాయకొండ సి ఐ చావా హాజరత్తయ్య పిలుపు ఇచ్చారు. సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో గంజి వారి కళ్యాణ మండపం నిర్వాహకుడు ప్రముఖ కాంట్రాక్టర్ గంజి ప్రసాద్ సహకారంతో ఏర్పాటు చేసిన చలివెంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సి ఐ చావా హాజరత్తయ్య మాట్లాడుతూ ఈ సారి వేసవి తీవ్రత ఎక్కువ గా ఉండే ప్రమాదం ఉందని ప్రజలు ఎండ బెట్ట, అంటు వ్యాధులనుండి అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా వివిధ గ్రామాల నుండి సింగరాయకొండ కి రాకపోకలు చేసే ప్రజలకు త్రాగు నీరు అందించి దాహార్తి తీర్చాలని గంజి ప్రసాద్ సంకల్పించి చలివెంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. దాతలు గంజి ప్రసాద్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వచ్చి సింగరాయకొండ పరిధిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని ఆయన పిలుపు ఇచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *