తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
పరాభవ నామ ఉగాది ఉత్సవాలు మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలోని కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలి ఉగాది ఉత్సవాల్లో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి , మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు , తెలుగుదేశం నాయకులు ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా పండితులను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వారిని సన్మానించారు.
అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం మరియు మార్కాపురం జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అని గత సంవత్సరంలో ప్రజలకు అంతా మంచి జరిగిందని మార్కాపురం జిల్లా కూడా ఏర్పడిందని ఈ పరాభవ నామ సంవత్సరం మార్కాపురం జిల్లాకి అంతా మంచి జరుగుతుందని ఈ ప్రాంతం త్వరలోనే హర్టికల్చర్ హాబ్ గా రూపుదిద్దుకుంటుందని త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు.