తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా, కందుకూరు పట్టణంలో పెద్ద బజారు నందు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విగ్రహ నిర్మాణ కర్తలు పబ్బిశెట్టి వరదరాజ , నల్లమల్లి వెంకటేశ్వర్లు , ఆధ్వర్యంలో బోణాల శ్రీనివాస చక్రవర్తి గారి తండ్రి బోణాల చెంచు కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కార్యక్రమానికి విచ్చేసిన చక్రవర్తి కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్యులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రారంభోత్సవం సందర్భంగా మజ్జిగ, వడపప్పు,కుటుంబ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి శ్రీనివాస చక్రవర్తి వారి కుటుంబ సభ్యులు మంచి మనసుతో వేసవికాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చడం ఓ మంచి కార్యక్రమమని అన్నారు. చక్రవర్తి కుటుంబ సభ్యులను ఆర్యవైశ్యుల తరఫున అభినందించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కేశవరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోట కిషోర్, కంకణాల వెంకటేశ్వర్లు, బచ్చు అనిల్, తాతా లక్ష్మీనారాయణ,ఇన్నమూరి శ్రీనివాసులు,చీదెళ్ల తిరుమల, కొత్తూరి సుధాకర్, అనుమాల శెట్టి శ్రీకాంత్, చేగు బాలాజీ, గుర్రం రాములు, ఇస్కాల మురళీకృష్ణ, పాదర్తి సురేష్, దేసుకోటేశ్వరరావు, చిన్ని శ్రీనివాసులు, చేగు నాగేంద్ర, పెట్టేటి కృష్ణ, గుర్రం వెంకటేశ్వర్లు (ఘంటసాల), కొత్తూరు బ్రహ్మం, ఇస్కాల సురేంద్ర, మద్దిమహావీర్ తదితర ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.