తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

రాజకీయ నాయకుల కు స్వాగతం, జన్మదిన, వివాహ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ అభిమానులు ఆయా పార్టీల కార్యకర్తలు ట్రంక్ రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల బోర్డు ల కారణంగా ప్రజలు భయాదోళన చెందుతున్నారు. సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ, పోలీస్, విద్యుత్ శాఖ అధికారుల అనుమతుల తో పని లేకుండా నాయకుల దగ్గర ఎవరికి వారు తమ తమ స్వామి భక్తిని ప్రదర్శించేందుకు ఆధిపత్యం చాటుకునేందుకు చేస్తున్న చర్యలు ప్రజలకు ప్రమాదాల పడే పరిస్థితి కి దారి తీస్తున్నాయి. గురువారం సాయింత్రం 5 ప్రాంతం లో వీచిన పెను గాలి, వర్షం బీభత్సానికి ట్రంక్ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విరిగి పడడం, ఫ్రేమ్ లు వాలి పోయి విద్యుత్ లైన్ పడేంత పరిస్థితికి గురి కావడం ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. పరిమితికి మించిన ఫ్లెక్సీలు కావడం తో పెనుగాలికి ఒరిగి పోయాయి. గ్రామ పంచాయతీ అధికారులు ఫ్లెక్సీల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడమే ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయి. ఇప్పటి కైన గ్రామ పంచాయతీ అధికారులు, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ఉమ్మడి చర్యలు తీసుకోవాలని ఫ్లెక్సీల ఎత్తు, ఏర్పాటు పై నియంత్రణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *