google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లో మెనూ తప్పనిసరిగా పాటించాలని టంగుటూరు MEO 2 తన్నీరు బాలాజీ ఉపాధ్యాయులకు సూచించారు. కాకుటూరి వారి పాలెం ప్రాథమిక పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన బాలాజీ సెలవుల్లో వంట సిబ్బందికి ఇచ్చిన శిక్షణ ప్రకారం భోజనం లో పోషక విలువలు తగ్గకుండా భోజనం తయారు చేయాలని వంటవారికి సూచించారు. విద్యార్థులు 30 మంది మాత్రమే హాజరు కావడానికి కారణం ఏంటని అడుగగా అమావాస్య కారణంగా విద్యార్థులు రాలేదని HM చిన్నమ్మాయి చెప్ప గా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లో అవగాహన కలిగించి రేపటికి విద్యార్థులందరూ బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని బాలాజీ ఉపాధ్యాయులను కోరారు. మధ్యాహ్నం భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత విద్యార్థులందరికీ పుస్తకాలు ఇచ్చారో లేదో పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు బోధనోపకరణాలతో చేసే బోధనను చూసి ఉపాధ్యాయురాలు లక్ష్మి ని అభినందించారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయిని చిన్నమ్మాయి, ఉపాధ్యాయులు రమేష్, కోటేశ్వర రావు, లక్ష్మీ పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *