తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరచడం, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం లక్ష్యంగా కందుకూరు డీఎస్పీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం లింగసముద్రం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ రికార్డులు, యూఐ (UI) కేసులు మరియు ఇతర పరిపాలనా అంశాలను సమీక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ (UI) కేసుల పురోగతిపై అధికారులతో చర్చించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతతో తీసుకుని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.అలాగే కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని సూచించారు.నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత మరియు ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.