తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-
ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలంలో ఇప్పగుంట గ్రామానికి చెందిన ముతకాని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన చుండి మల్లికార్జున అనే వ్యక్తి దగ్గర 8-4-2022 వ తేదీన సర్వేనెంబర్ 361 లో 23 గదులు లేక 184 చదరపు గజములు లను స్వాధీన అనుభవంలో ఉండి బేస్ మట్టం వేసి ఉన్న ఖాళీ స్థలమును కొనుగోలు చేసాము, చుండి మల్లికార్జున గారి ద్వారా విక్రయ స్వాధీనపు అగ్రిమెంటు కూడా పొంది ఉన్నాము, మేము స్థలం కొనుగోలు చేసే సమయంలో సాక్షులు కూడా ఉన్నారు, అయితే నా స్థలముపై ఎటువంటి హక్కులు లేకుండా నా అనుభవంలో ఉన్న స్థలమును స్వాధీనం చేసుకోవాలని ఆశ పుట్టి మా గ్రామంలో పలుకుబడి కలిగి ఆర్థిక స్తోమత కలిగి ఉన్న మా గ్రామానికి చెందిన మరొక వ్యక్తి మమ్మల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మా స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఈరోజు ముతకాని లక్ష్మీనారాయణ గారి భార్య ముతకాని కవిత తెలియజేస్తూ, జనసేన పార్టీ నాయకులు మాకు న్యాయం చేయాలి జనసేన పార్టీ మీద ప్రజలకు మంచి నమ్మకం భరోసా కూడా ఉంది అంటూ ఈరోజు జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ గారిని కలిసి న్యాయం చేయండి అంటూ వారి బాధను తెలియపరిచారు.
విచారణ జరిపి ఆధారాలు పరిశీలించి తగిన అధికారులతో మాట్లాడి ముతకాని కవితకి మరియు వారి కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ అండగా ఉంటూ న్యాయం చేస్తుంది అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.
బాధితులకు అండగా జనసేన పార్టీ పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు ఉన్నారు.