దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నెల్లూరుకు చెందిన భక్తులు ఆసోది దినకర్ రెడ్డి, ఆయన ధర్మపత్ని జయమాధవి రూ.90 వేల విలువైన ఎయిర్ కండీషనర్ (ఏసీ)ను శుక్రవారం విరాళంగా అందజేశారు.దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, కార్యనిర్వహణాధికారి పి. కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ విరాళాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తులు ఇలాగే సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు ఉదయగిరి వెంకట శేష లక్ష్మీనరసింహాచార్యులు, రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *