google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరు పట్టణంలో ఏఐటీయూసీ అనుబంధ స్కందపురి పెయింట్ వర్కర్స్ యూనియన్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా స్థానిక కోటారెడ్డి నగర్ లో ఉన్న స్కందపురి పెయింట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ అధ్యక్షులు జమ్మలమడుగు రవి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది అనంతరం యూనియన్ కార్యాలయం వద్ద నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కార మార్గంలో ఏఐటియుసి ముందుంటుందని ఆయన అన్నారు. పెయింట్ కార్మికులు అనునిత్యం శ్రమిస్తున్న వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోలేకపోతున్నారని వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఎర్రంశెట్టి ఆనందమోహన్ మాట్లాడుతూ పెయింట్ వర్కర్స్ యూనియన్ ఆరు సంవత్సరాలుగా ఏ ఒక్క సభ్యుని క⁶ ఆపద వచ్చిన ముందుండి వారిని ఆదుకోవడంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐయుటిసి అనుబంధ స్కందపురి పెయింట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి కంకణాల చిన్న బ్రహ్మయ్య, కోశాధికారి నాగరాజు, యూనియన్ ఉపాధ్యక్షులు కార్యదర్శులు విద్యార్థులు పాల్గొన్నారు.మెట్రా శీను, తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *