google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఓపెన్ బూజింగ్ (బహిరంగ మద్యపానం) జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రదేశాలను గుర్తించి శుభ్రపరిచారు. మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు మరియు ఇతర వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో బహిరంగ మద్యపానం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *