తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రజల భద్రత, నేరాల నివారణ మరియు సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సైబర్ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన మరియు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో ప్రజలకు ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, పెట్టుబడి మోసాలు మరియు బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే ఆర్థిక, చట్టపరమైన నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు.అదేవిధంగా మహిళలు, బాలికల భద్రత కోసం అందుబాటులో ఉన్న భద్రతా చట్టాలు, శక్తి యాప్ వినియోగం, సైబర్ వేధింపుల నివారణ, పోక్సో చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. యువత గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వినియోగం జీవితాలను నాశనం చేస్తుందని వివరిస్తున్నారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ సురక్షిత ప్రయాణానికి సూచనలు అందిస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు మరియు ఇతర నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని పోలీసులు తెలిపారు.