స్వామి వారి కైంకర్యాలకు దాతలు ముందుకు రావాలి.
దేవాలయ అభివృద్ధికి దాతలు, భక్తులు సహకారం అందించాలి.
ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
దేవాలయాల పరిరక్షణ అభివృద్ధి సనాతన ధర్మ సేవలో యోగానంద లక్ష్మి నారసింహ స్వామి భక్తులు,దాతలు ముందుకు వచ్చి తమవంతు కైంకర్యాలు,విరాళాలు సమర్పించాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు పిలుపు ఇచ్చారు. పాత సింగరాయకొండ శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో వేంచేసి భక్తుల కొంగు బంగారు గా ఉన్న యోగానంద లక్ష్మి నారసింహ స్వామి వారికి సింగరాయకొండ కి చెందిన భక్తుడు జవంగుల ఆదినారాయణ కుటుంబ సభ్యులు రెండు లక్షల 35 వేలు విలువ చేసే రాళ్ళు పొదిగిన బంగారు ఉంగరాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు దేవాలయ కార్యనిర్వహణ అధికారి పాతకోట కృష్ణవేణి కి అందజేశారు. ఈ సందర్భంగా భక్తుడు ఆదినారాయణ, ఆయన కుటుంబ సభ్యులు వివరిస్తూ తమకి యోగానంద లక్ష్మి నారసింహ స్వామి వారి మీద ఉన్న విశ్వాసం, భక్తి విశ్వాసాల కారణంగా ప్రత్యేకంగా ఉంచిన నిధుల నుండి స్వామి వారికి బంగారు ఉంగరం సమర్పించుకునే అవకాశం కలిగిందన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఉంగరాన్ని యోగానంద లక్ష్మి నారసింహ స్వామి వారికి అలంకరించాలని ఆదినారాయణ కోరారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, ఇ ఒ కృష్ణ వేణి, అర్చకులు ఉదయగి శేష లక్ష్మి నారసింహ చార్యులు, ఉదయగిరి లక్ష్మి నారసింహ చార్యులు, ఉదయగిరి సుదర్శన చార్యులు ఆలయ సిబ్బంది, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.