తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు చెడు నడత గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చెడు నడత కలిగిన వ్యక్తులు, పాత నేరస్తులు మరియు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. నేరాలకు పాల్పడటం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం మరియు భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అవగాహన కల్పించారు.అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు, గొడవలు, బెదిరింపులు, అక్రమ కార్యకలాపాలు, మద్యం మత్తులో అసాంఘిక ప్రవర్తన వంటి అంశాలపై హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజల భద్రత, నేరాల నియంత్రణ మరియు ప్రశాంత వాతావరణ పరిరక్షణ కోసం ఇటువంటి కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.